పవన్‌తో టాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతుందా?

ప్రముఖ బాలీవుడ్‌ కథానాయిక సోనాక్షి సిన్హా టాలీవుడ్‌ ఇవ్వనుందని అంటున్నాయి సినీ వర్గాలు. పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడుగా దర్శకుడు క్రిష్‌ ఓ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఇద్దరి కథానాయికలకు అవకాశం ఉందని సమాచారం. పవన్‌ సరసన నటించే అవకాశం ప్రగ్యా జైస్వాల్‌ అందుకుందని ఇప్పటికే వార్తలొచ్చాయి. ఆమెతోపాటు సోనాక్షి కూడా పవన్‌తో నటించనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. హిందీ చిత్రాలతో సోనాక్షి తెలుగు ప్రేక్షకులకు పరిచయమే కానీ ఇప్పటి వరకు ఆమె తెలుగులో నటించలేదు. ఇది ఖరారైతే ఆమెకు తొలి తెలుగు చిత్రం ఇదే అవుతుంది. మరి పవన్‌తో ఆడిపాడేది ఈ ఇద్దరు ముద్దుగుమ్మలా, కాదా? తెలియాలంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాలిసందే. మరోవైపు ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారంటూ ప్రచారం సాగుతుంది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.