క్రిష్‌ - వైష్ణవ్‌ తేజ్‌ కొత్త చిత్రం పేరు 'కొండపొలం'?

సమాజంలో జరిగే యాదార్థ సంఘటనలను ఆధారం చేసుకొని కమర్షియల్‌ హంగులతో సినిమాలను తెరకెక్కించే దర్శకుడు క్రిష్‌. ‘ఉప్పెన’ కథానాయకుడు వైష్ణవ్‌ తేజ్‌తో కలిసి ఓ సినిమా తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని కేవలం 45రోజుల్లో సింగిల్‌ షెడ్యూల్లోనే పూర్తి చేశారు. అది కూడా లాక్‌డౌన్‌ నిబంధనలకు అనుగుణంగా. రకుల్‌ ప్రీత్ సింగ్‌ కథానాయికగా నటిస్తున్న చిత్రానికి ‘కొండపొలం’ అనే పేరును ఖరారు చేసినట్లు సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగానే చిత్రాన్ని రూపొందించారు. ప్రస్తుతం అదే పేరును చిత్రానికి పెట్టారంట. ఈ టైటిల్‌ అయితేనే సినిమా కథకి సరిగ్గా అమరుతుందని భావించడంతోనే ‘కొండపొలం’ పేరుపై మొగ్గు చూపినట్లు సమాచారం. ఇందులో రకుల్ ప్రీత్‌ సింగ్‌ గిరిజన యువతిగా కనిపించనుందట. 



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.