‘క్షణం’ దర్శకుడితో రానా.. ‘కృష్ణ అండ్‌ హిస్‌ లీల’!!

దర్శకుడిగా తెలుగు తెరపైకి అడుగుపెడుతూనే ‘క్షణం’ వంటి హిట్‌ను ఖాతాలో వేసుకోని అందరి దృష్టినీ ఆకర్షించారు రవికాంత్‌ పేరెపు. కానీ, ఈ చిత్రం బయటకొచ్చి మూడేళ్లు దాటుతున్నా ఇంతవరకు ఆయన నుంచి మరో ప్రాజెక్టేదీ పట్టాలెక్కలేదు. అయితే ఎట్టకేలకు ఈ యువ దర్శకుడు రానాతో కలిసి ‘కృష్ణ అండ్‌ హిస్‌ లీల’ అనే చిత్రాన్ని పట్టాలెక్కించారు. అలాగని ఇందులో రానా కథానాయకుడేమీ కాదండోయ్‌.. కేవలం సమర్పకుడంతే. ఆయన తమ సొంత బ్యానర్‌ సురేష్‌ ప్రొడక్షన్స్‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘గుంటూరు టాకీస్‌’ ఫేం సిద్ధు కథానాయకుడిగా నటిస్తున్నాడు. శ్రద్ధా శ్రీనాథ్‌, సీరత్‌ కపూర్‌, శాలిని కథానాయికలు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో సిద్ధు ముగ్గురు కథానాయికలతో రొమాంటిక్‌ మూడ్‌లో ఉన్నట్లుగా దర్శనమిచ్చారు. ఈ చిత్రాన్ని పుకార్ల ఆధారంగా రూపొందిస్తున్నట్లు చిత్ర ఉపశీర్షికను బట్టీ తెలుస్తోంది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.