‘ఆదిపురుష్’‌లో క్రితి సనన్‌ నటిస్తుందా?

‘సాహో’ నటుడు ప్రభాస్‌ హిందీ దర్శకుడు ఓం రావత్‌ దర్శకత్వంలో నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆదిపురుష్’‌. ఎప్పుడైతే సినిమా ప్రకటించారో అప్పటి నుంచి చిత్రంపై అంచనాలు పెరగడంతో పాటు నటీనటులు ఎవరనే అంశంపై కూడా పెద్ద ఎత్తున చర్చలు సాగుతున్నాయి. చిత్రంలో రాముడు పాత్రలో ప్రభాస్‌ నటిస్తున్నారు. ఇక పత్రినాయకుడు రావణ్‌గా సైఫ్‌ అలీఖాన్‌ నటిస్తున్నారు. ఇక మిగిలిన ప్రధాన పాత్ర సీత.  తాజాగా ఈ పాత్రలో నటి క్రితి సనన్‌ నటిస్తుందనే వార్తలు బయటకు వచ్చాయి. ప్రస్తుతం ఆమె పేరుని పరిశీలిస్తున్నారని హిందీ సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే ఇప్పటికే సీతగా ‘మహానటి’లో నటించిన కీర్తి సురేష్‌ పేరుతో పాటు కియారా అడ్వాణి, అనుష్క శర్మలాంటి వాళ్ల పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. కానీ చిత్రబృందం వాటిని కొట్టిపారేసింది. మొత్తంగా మరికొన్నాళ్లు ఆగితే కానీ సీతగా ఎవరు నటించనున్నారనే విషయం తెలియదు. అంతేకాదు ఆ మధ్య బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ శివుడి పాత్రలో నటించనున్నారనే వార్తలు సైతం వైరలయ్యాయి. ‘ఆదిపురుష్’‌లో మొత్తంగా చూస్తే ప్రభాస్‌, సైఫ్‌ అలీఖాన్‌ పాత్రలు తప్ప మిగతా నటీనటులు ఎవరనే విషయంపై రోజుకో రకంగా వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ప్రస్తుతం క్రితి ససన్‌ నటిస్తున్న చిత్రం ‘మిమి’. ‘లుకా చుప్పి’ ఫేమ్‌ లక్ష్మణ్‌ ఉటేకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.