దర్శకుడిగా మరో ప్రముఖ రచయిత

దశాబ్దం క్రితం వరకు చిత్రసీమలో దర్శకులు.. కథా రచయితలు వేర్వేరు వర్గాలుగా ఉండేవారు. కానీ, ఇప్పుడలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. రచయితలే దర్శకులుగా కొత్త అవతారాలెత్తుతున్నారు. ఎవరి కథలను వాü™్ల డైరెక్ట్‌ చేసుకుంటూ వెండితెరపై స్టార్‌ డైరెక్టర్లుగా సత్తా చాటుతున్నారు. ఇలా దర్శకరచయిత అనే కొత్త ఒరవడికి నాంది పలికిన వారిగా పూరి జగన్నాథ్, త్రివిక్రమ్, కొరటాల శివ, అనిల్‌ రావిపూడి వంటి వారిని చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం వస్తోన్న నవతరం దర్శకులు వివేక్‌ ఆత్రేయ, ప్రశాంత్‌ వర్మ, శివ నిర్వాణ, గౌతమ్‌ తిన్ననూరి అంతా ఈ బాట నుంచి వచ్చి సత్తా చాటుతున్న వారే. ఇప్పుడీ జాబితాలోకి మరో రచయిత కూడా వచ్చి చేరబోతున్నారు. ‘చందమామ’, ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘ఓ బేబీ’ వంటి హిట్‌ చిత్రాలకు కథా రచయితగా పనిచేసిన లక్ష్మీ భూపాల్‌ ఇప్పుడు దర్శకుడిగా మారబోతున్నారట. త్వరలోనే ఆయన మెగాఫోన్‌ చేతబట్టి యాక్షన్‌ చెప్పబోతున్నారట. యువ కథానాయకుడు సత్యదేవ్‌తో ఆయన ఓ సినిమా తియ్యబోతున్నారని సమాచారం. ఇప్పటికే ఈ చిత్ర పూర్వ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని, లక్ష్మీభూపాల్‌ స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నారని సమాచారం. అంతేకాదు.. ఆయన ఓ సొంత నిర్మాణ సంస్థని కూడా ప్రారంభించబోతున్నారట. త్వరలోనే వీటిపై ఆయన నుంచి ఓ అధికారిక ప్రకటన వెలువడనుందట.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.