లోకేష్‌ దర్శకత్వంలో కమల్‌

కార్తి కథానాయకుడిగా నటించిన ‘ఖైదీ’ తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పించింది. ఆ చిత్ర దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ అగ్ర కథానాయకుడు కమల్‌హాసన్‌తో జట్టు కట్టారు. కమల్‌ 232వ చిత్రాన్ని లోకేష్‌ తెరకెక్కించబోతున్నారు. రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ నిర్మించబోతోంది. బుధవారమే లోకేష్‌ కనకరాజ్‌ ఈ చిత్రాన్ని ప్రకటించారు. ‘ఒకప్పుడు అక్కడ ఒక దెయ్యం నివసించింది’ అని రాసున్న ఓ పోస్టర్‌ని విడుదల చేసింది చిత్రబృందం. అనిరుధ్‌ స్వరకల్పనలోని ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవికి విడుదల కాబోతోంది. ప్రస్తుతం విజయ్‌ కథానాయకుడుగా ‘మాస్టర్‌’ తెరకెక్కిస్తున్నాడు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.