చిత్రీకరణ నుంచే రికార్డుల వేట

మిళ అగ్ర నటుడు ఇళయదళపతి విజయ్‌ సినిమా వస్తుందంటే బాక్సాఫీస్‌ రికార్డులు బద్దలవ్వటం ఖాయమే అని ఇప్పటికే చాలా సినిమాలు నిరూపించాయి. ఇప్పుడు చిత్రీకరణ దశ నుంచే ఆ పనులు మొదలుపెట్టాడు విజయ్‌. ఈ దళపతి తాజాగా ‘ఖైదీ’ దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో ‘దళపతి 64’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఒక సినిమాలో నటిస్తున్నాడు. డిజిటల్‌ మాధ్యమంలో అగ్ర స్థానంలో ఉన్న అమెజాన్‌ ప్రైమ్‌ ఈ చిత్రాన్ని ఇప్పటి వరకు ఏ తమిళ చిత్రానికి ఇవ్వనంతా మొత్తం చెల్లించి డిజిటల్‌ హక్కులు సొంతం చేసుకుందని సమాచారం. ఇది కొన్ని బాలీవుడ్‌ చిత్రాలను కూడా దాటేసిందని వినికిడి. ‘ఖైదీ’ బ్లాక్‌బస్టర్‌ తరువాత లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వం, ‘విజిల్‌’ సూపర్‌హిట్‌ తరువాత విజయ్‌ నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరాయి. విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి ప్రతినాయకుడిగా నటించటం మరో ప్రత్యేకం. వచ్చే వేసవికి ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు దర్శక నిర్మాతలు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.