మాధవన్‌ ‘మారా’ షురూ!

మాధవన్‌ అంటే మనకు టక్కున గుర్తొచ్చే చిత్రం ‘సఖి’. ఆ చిత్రంతో మాధవన్‌ ప్రేమకథ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారారు. తరువాత మాధవన్‌ ప్రేమకథా చిత్రాలతో పాటు వైవిధ్యభరితమైన చిత్రాల్లోనూ నటించి అలరించారు. అనుష్కతో కలిసి మాధవన్‌ హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రం ‘నిశ్శబ్దం’. వచ్చే నెల్లోనే తెరపైకి రానుంది. ఇదిలా ఉండగానే మాధవన్‌ తమిళ్లో ‘మారా’ అనే చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుందట. గతంలో సినిమాకి సంబంధించిన షూటింగ్‌ కొంత మేర జరిగింది. మధ్యలో మాధవన్‌ నటిస్తున్న కొన్ని చిత్రాల్ల వల్ల ఈ సినిమా షూటింగ్‌ నిలిచిపోయింది. ఇక సినిమా చిత్రీకరణ కొద్ది భాగం మాత్రమే పూర్తి కావల్సింది. దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో రొమాంటిక్‌ ప్రేమకథగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్‌ కథానాయికగా నటిస్తోంది. ప్రమోద్‌ ఫిల్మ్స పతాకంపై నిర్మితమయ్యే సినిమాకి గిబ్రాన్‌ సంగీతం అందిస్తున్నారు. ‘మారా’ చిత్రం మలయాళంలో దుల్కర్‌ సల్మాన్‌ నటించిన ‘చార్లీ’ చిత్రానికీ రీమేక్‌.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.