ముచ్చటేస్తున్న కమిట్‌మెంట్‌ తేజస్వి పోస్టర్‌

తెలుగమ్మాయి మదివాడ తేజస్వి నటిస్తున్న చిత్రం కమిట్‌మెంట్‌. లక్ష్మీకాంత్‌ చెన్నా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో న‌లుగురు ప్ర‌ధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే సినిమాకి సంబంధించిన స్పెష‌ల్ పోస్ట‌ర్ విడుదలై అంద‌రినీ ఆక‌ట్టుకుంది. న‌లుగురి క‌థ‌గా రూపొందుతోన్న ఈ ఎరోటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌ తేజ‌స్వి మ‌దివాడ‌, ర‌మ్య ప‌సుపులేటి, సిమ‌ర్ సింగ్‌, అన్వేషి జైన్లు నటిస్తున్నారు. "ల‌వ్‌.. డ్రీమ్‌.. హోప్‌.. ఫైట్" అనేది ఈ చిత్రానికి ట్యాగ్‌లైన్‌. ఈరోజు మదివాడ తేజస్వి పుట్టినరోజు ఈ సంద‌ర్భంగా, 'క‌మిట్‌మెంట్‌'లో ఆమె ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను చిత్రబృందం విడుద‌ల చేసింది. ఈ పోస్ట‌ర్‌లో బికినీ ధ‌రించి బోల్డ్ అవ‌తార్‌లో తేజ‌స్వి ద‌ర్శ‌న‌మిస్తుంది. మునుప‌టి పోస్ట‌ర్ త‌ర‌హాలోనే ఈ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ సైతం అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తోంది. 'హైద‌రాబాద్ న‌వాబ్స్' ఫేమ్ ల‌క్ష్మీకాంత్ చెన్నా ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం వహిస్తుండగా న‌రేష్ కుమ‌ర‌న్ సంగీతం స‌మ‌కూరుస్తున్నారు. ఎఫ్‌3 ప్రొడ‌క్ష‌న్స్‌, ఫుట్‌లూజ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న సినిమాకి స‌జీష్ రాజేంద్ర‌న్‌, న‌రేష్ రాణా సినిమాటోగ్రాఫ‌ర్లుగా ప‌నిచేస్తున్నారు.

Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.