మహాలక్ష్మి బి.ఏ!

టి.డబ్ల్యూ.ఎస్ టాకీస్ పతాకంపై వస్తోన్న లవ్, డ్రామా చిత్రం మహాలక్ష్మి బి.ఏ. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన లభించింది. ఈ చిత్ర మొదటి లిరికల్ వీడియో 'ఇప్పుడిప్పుడే' అనే పాట దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 25న విడుదల కానుంది. రమ్య చిన్ని ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీని రాజేష్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఒక అమ్మాయి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. చిత్రీకరణ అంతా హైదరాబాద్‌లోనే జరుపుకోనుంది. హర్ష ప్రవీణ్ సంగీతం అందించిన ఈ పాటకు ప్రభాకర్ దండు సాహిత్యం అందించారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.