‘మహావీర్‌ కర్ణ’ కోసం గుడి గంటకు పూజ!!

‘బాహుబలి’ చిత్ర విజయాలిచ్చిన స్ఫూర్తితో భారతీయ చిత్రసీమలో భారీ బడ్జెట్‌ చిత్రాలకు గేట్లు తెరుచుకున్నాయి. ప్రస్తుతం ఉత్తర, దక్షిణ చిత్రసీమల్లో బ్రహ్మాస్త్ర, సైరా నరసింహారెడ్డి, ఆర్‌ఆర్‌ఆర్, కేజీఎఫ్, 2 ఓ వంటి భారీ ప్రాజెక్టులు సెట్స్‌పై ముస్తాబవుతన్నాయి. ఇప్పుడీ జాబితాలో తమిళ స్టార్‌హీరో విక్రమ్‌ చిత్రం కూడా వచ్చి చేరింది. ఆయన కథానాయకుడిగా దర్శకుడు ఆర్‌ఎస్‌ విమల్‌ తెరకెక్కించబోతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘మహావీర్‌ కర్ణ’. దాదాపు రూ.300 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు ఆర్‌ఎస్‌ విమల్‌ తాజాగా తిరువనంతపురంలోని పద్మనాభస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ఆ పూజ మొత్తం గుడి గంట మీదనే జరగడం. ఎందుకంటే ‘మహావీర్‌ కర్ణ’లో ఈ గుడి గంటకు ఎంతో ప్రాధాన్యముండబోతుందట. ఈ కార్యక్రమంలో సురేష్‌ గోపి, ఇంద్రన్స్, బి ఉన్నికృష్ణన్‌తో పాటు పలువురు మాలీవుడ్, కోలీవుడ్‌ సినీ తారలు పాల్గొన్నారట.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.