దూసుకుపోతున్న ‘మహర్షి’

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్‌బాబు నటించిన చిత్రం ‘మహర్షి. విడుదలైన తొలివారంలోనే సినిమా వసూళ్లు దూసుకుపోతున్నాయి. భారీ బడ్జెట్ తెరకెక్కిన ఈ చిత్రాన్ని ముగ్గురు పెద్ద నిర్మాతలు కలిసి నిర్మించారు. చలసాని అశ్వినిదత్, దిల్‌రాజు, పొట్లూరి వీరు పేరు వినగానే సినిమాపై అంచనాలు కూడా భారీగానే పెరిగాయి. ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం, ప్రారంభంలోనే మంచి వసూళ్లు సాధిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటివారంలోనే ఈ సినిమా 59 కోట్లకు పైగా చేసిందట. ఒక్క నైజామ్‌ ప్రాంతంలోనే సుమారు ఇరవైఒక్క కోట్లు రాబట్టడం చాలా పెద్ద విషయం. మొత్తం వేసవి కాలంలో ప్రేక్షకులకు మంచి వినోదమే పంచుతుందన్నమాట ‘మహర్షి చిత్రం. ఇందులో అల్లరి నరేష్‌ పాత్ర కూడా బాగానే ఉందని చెప్పుకుంటున్నారు. ఇక పూజాహెగ్డే అందంతో ప్రేక్షకుల మతిపోగొట్టింది.

                                 


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.