శర్వా సరసన ఐశ్వర్య?

శర్వానంద్‌ సరసన ఐశ్వర్య రాజేష్‌ నటించబోతుందా? అవుననే వినిపిస్తుంది ఫిల్మ్‌ నగర్‌ వర్గాల్లో. దర్శకుడు అజయ్‌ భూపతి శర్వానంద్‌ కథానాయకుడుగా ‘మహాసముద్రం’ చిత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. ఇందులోనే నాయికగా ఐశ్వర్యను ఎంపిక చేస్తున్నారని సమాచారం. ప్రేమ, యాక్షన్‌ నేపథ్యంలో సాగే ఈ కథకి సహజత్వంతో కూడిన నటి అయితే బావుంటుందని భావించిన చిత్రబృందం ఐశ్వర్యను సంప్రదించిందని తెలుస్తోంది. త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం శర్వా ‘శ్రీకారం’ చిత్రంలో నటిస్తున్నాడు. ‘టక్‌ జగదీష్‌’తో బిజీగా ఉంది ఐశ్వర్య.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.