న‌మ్ర‌త వ‌ల్లే సినిమా ఆగిపోయిందా?
మ‌హేష్ బాబు - సుకుమార్ సినిమా అర్థాంత‌రంగా ఆగిపోయిన సంగ‌తి తెలిసిందే. `క్రియేటీవ్ డిఫ‌రెన్సెస్‌` అంటూ మ‌హేష్ కూడా క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాడు. సుకుమార్ స్వ‌యంగా చెన్నై వెళ్లి మ‌హేష్‌కి సారీ చెప్పొచ్చాడు కూడా. అయితే.. ఈ ఇష్యూ వెనుక న‌మ్ర‌త హ్యాండ్ కూడా చాలా గ‌ట్టిగానే ఉంద‌ని టాక్‌.


ఈ మ‌ధ్య మ‌హేష్‌బాబు సినిమా విష‌యాల్లో న‌మ్ర‌త విప‌రీతంగా జోక్యం చేసుకొంటోంది. మ‌హేష్ కూడా కొన్ని విష‌యాల్లో చూసీ చూడ‌నట్టు వ్య‌వ‌హ‌రిస్తుంటే.. న‌మ్ర‌త మాత్రం ప్ర‌తీ విష‌యంలోనూ త‌ల‌దూరుస్తోంద‌ని ఈ విష‌యంలో సుకుమార్ కాస్త ఇబ్బంది ప‌డ్డాడ‌ని తెలుస్తోంది. ఓ ద‌శ‌లో సుకుమార్ క‌థ‌ని మ‌హేష్ ఓకే చేసేశాడు. షెడ్యూల్స్ కూడా రెడీ అవుతున్న ద‌శ‌లో న‌మ్ర‌త ఎంట‌ర్ అయ్యింద‌ట‌. అవుడ్డోర్ షూటింగ్ వద్దు.. ఏదైనా స‌రే సెట్టింగ్ వేయాల్సిందే - అంటూ కండీష‌న్లు పెట్టిన‌ట్టు తెలుస్తోంది. ఎర్ర చంద‌నం నేప‌థ్యంలో సాగే సినిమా ఇది. అందుకోసం అడ‌వుల్లో షూటింగ్ చేయాల్సివ‌చ్చింది. కానీ నమ్ర‌త `సెట్‌` అనే ప్ర‌తిపాద‌న తెచ్చేస‌రికి.. సుకుమార్ విబేధించాడ‌ట‌.

ఈ సినిమా కోసం మ‌హేష్ ని గెడ్డం పెంచ‌మ‌ని సుకుమార్ అడిగాడ‌ట‌. అందుకు మహేష్ కూడా ఓకే అన్నాడ‌ట‌. కానీ న‌మ్ర‌త మాత్రం `మ‌హేష్ గెడ్డం పెంచాల్సిన అవ‌స‌రం ఏముంది..?` అంటూ అడ్డు చెప్పింద‌ట‌. సుకుమార్ చాలా వ్య‌వ‌హారాల్లో ప‌క్క‌గా ఉంటాడు. త‌న ఆలోచ‌న‌లన్నీ వేరు. ఇలా ప్ర‌తీ విష‌యంలోనూ న‌మ్ర‌త అడ్డుప‌డ‌డం సుకుమార్‌కి న‌చ్చ‌లేద‌ని - ఈ సినిమా నుంచి తాను బ‌య‌ట‌కు వ‌చ్చేయ‌డానికి నమ్ర‌త కూడా ఓ కార‌ణ‌మైంద‌ని ఇన్‌సైడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.