ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో?

హేష్‌ 27’ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇటీవలే ‘సరిలేరు నీకెవ్వరు’ విజయం అందుకున్న మహేష్‌ తన తదుపరి చిత్రం వంశీ పైడిపల్లితో చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ, కథలో మార్పులు కావాలని మహేష్‌ కోరడంతో ఈ ప్రాజెక్టు తాత్కాలికంగా పక్కన పెట్టారని సమాచారం. కొంతకాలం తర్వాత స్క్రిప్ట్‌లో మార్పులు చేసి తెరకెక్కించనున్నారట. ఈ లోపు మరో సినిమా పట్టాలెక్కించేందుకు మహేష్‌ ప్రయత్నిస్తున్నాడని తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థలో నటించబోయే చిత్రానికి పరశురామ్‌ దర్శకత్వంలో వహిస్తాడని వినిపిస్తోంది. ఇదిలా ఉండగానే మరో చిత్రాన్ని లైన్లో పెట్టాలని భావిస్తున్నాడట మహేష్‌. ‘చందమామ కథలు’, ‘గరుడవేగ’ ఫేం ప్రవీణ్‌ సత్తారు ఓ కథ వినిపించాడని, కొత్త పంథాలో ఉండటంతో మహేష్‌ ఓకే అన్నాడని వినికిడి. ఇదే నిజమైతే మహేష్‌ మ´డు చిత్రాలతో బిజీ అయినట్లే. త్వరలోనే ఏ చిత్రం ఎవరితో ఎప్పుడు చేస్తాడో తెలియనుంది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.