మహేష్‌ త్రిపాత్రాభినయం!
కథానాయకుడు మహేష్‌బాబుకు వైవిధ్యమైన పాత్రలంటే ఉత్సాహమే. అలా ఇప్పుడు మహేష్‌ ఒకేసారి మూడు పాత్రల్లో నటించనున్నారని సినీ వర్గాల సమాచారం. ‘మహర్షి’ చిత్ర కోసం మూడు భిన్నమైన పాత్రలు చేయబోతున్నారట. విద్యార్థిగా, కార్పోరేట్‌ సీఇఓగా, ఒక రైతుగా కనిపించనున్నారట. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్, టీజర్‌లు అలరిస్తున్నాయి. ఈ సినిమా కోసం ఫిల్మ్‌సిటీలో భారీ సెట్స్‌ సిద్ధం చేశారు. వంశీ పైడిపల్లి దర్శకుడిగా వ్యవహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా, అల్లరి నరేష్‌ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. పీవీపీ, దిల్‌రాజు, చలసాని అశ్వినిదత్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయనున్నారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.