‘మహర్షి’ విజయోత్సవం విజయవాడలో
మహేష్‌ బాబు నటించిన 25వ సినిమా ‘మహర్షి’. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందింది. మే 9న ప్రేక్షకుల ముందుకొచ్చి విజయవంతమైంది. ఈ విజయాన్ని పురస్కరించుకొని చిత్రబృందం విజయోత్సవ వేడుకను విజయవాడలో నిర్వహించబోతోంది. సిద్దార్థ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజిమెంట్‌ మైదానంలో ఈ వేడుక నిర్వహించబోతున్నారు. కీలక పాత్రలో అల్లరి నరేశ్‌ నటించారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే పలు అవార్డ్స్…రికార్డ్స్ సాధించి వార్తల్లో నిలువుగా..తాజాగా మరో ఘనత సాధించి మీడియా లో హైలైట్ అయ్యాడు.ప్రతి యేటా మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాను ప్రకటించే టైమ్స్ మ్యాగజైన్.. ఫరెవర్ డిజైరబుల్ క్లబ్ పేరుతో ఇంకో జాబితాను ప్రకటిస్తుంటుంది. ఇప్పటి వరకు ఈ జాబితాలో సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్, ఆమీర్ ఖాన్ వంటి బాలీవుడ్ స్టార్ హీరోలు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఆ లిస్టులో చోటు దక్కించుకున్నారు. ప్రతిసారి మహేష్ మోస్ట్ డిజైరబుల్ జాబితాలో టాప్ స్థానంలో వస్తుండటంతో ఆయన పేరును ఫరెవర్ డిజైరబుల్ క్లబ్‌లో చేర్చడం విశేషం. ఈ వార్త తెలుసుకున్న అభిమానులు సంబరాలు చేసుకుంటూ..సోషల్ మీడియా లో తెగ షేర్ చేస్తున్నారు.

మరో కథ విన్నారు

దర్శకులతో సినిమాలు చేయడానికి ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు మహేష్‌బాబు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఇటీవల ‘మహర్షి’ చేసిన ఆయన, తదుపరి అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో నటించనున్న సంగతి తెలిసిందే. జూన్‌లోనే ఆ చిత్రం మొదలు కాబోతోంది. ఆ తర్వాత పరశురామ్‌ దర్శకత్వంలో మహేష్‌ సినిమా చేసే అవకాశాలున్నాయి. ‘గీత గోవిందం’తో ఘన విజయాన్ని సొంతం చేసుకొన్న పరశురామ్‌... ఇటీవలే మహేష్‌కి చూచాయిగా కథ వినిపించినట్టు తెలిసింది. అది మెచ్చిన ఆయన, పూర్తిస్థాయిలో స్క్రిప్టు సిద్ధం చేయమన్నట్టు సమాచారం. అన్నీ కుదిరితే... అనిల్‌ రావిపూడితో చేయనున్న సినిమా పూర్తయ్యాక, పరశురామ్‌ దర్శకత్వంలోనే మహేష్‌ నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పరశురామ్‌ తెరకెక్కించిన ‘గీత గోవిందం’ రూ: వంద కోట్లకిపైగా వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే.









Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.