మ‌హేష్‌... సుక్కు క‌లిశారా?

`1` (నేనొక్క‌డినే) త‌ర్వాత మ‌హేష్‌బాబు - సుకుమార్ క‌ల‌యిక‌లో మ‌రో సినిమా వ‌స్తుంద‌ని అంతా ఆశించారు. కానీ కొన్ని కార‌ణాల‌వ‌ల్ల ఆ కాంబినేష‌న్ మ‌ళ్లీ కుద‌ర‌లేదు. దీనిపై మ‌హేష్‌బాబు కూడా ప్ర‌క‌ట‌న చేశాడు. సృజ‌నాత్మ‌కప‌ర‌మైన విష‌యాల్లో వ‌చ్చిన స‌మ‌స్య‌ల వ‌ల్లే సినిమా కార్య‌రూపం దాల్చ‌డం లేద‌ని ఆయ‌న ట్వీట్ చేశారు. అంతకుముందే సుకుమార్... అల్లు అర్జున్‌తో సినిమా చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టన వెలువడింది. అయితే ఈ విష‌యంపై సామాజిక మాధ్య‌మాల్లో పెద్ద చ‌ర్చ సాగింది. మొద‌ట త‌నతో సినిమా చేయాల‌నుకున్న సుకుమార్, త‌న‌కి స‌మాచారం ఇవ్వ‌కుండానే అల్లు అర్జున్‌తో సినిమా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించ‌డంపై మ‌హేష్‌బాబు ఒకింత అస‌హ‌నానికి గుర‌య్యార‌ని, అందుకే ఆయ‌న ట్వీట్ చేశార‌ని... మ‌ళ్లీ ఈ క‌ల‌యిక‌లో సినిమా ప‌ట్టాలెక్క‌డం క‌ష్ట‌మే అని మాట్లాడుకున్నారు. ఏం జ‌రిగిందో ఏమో తెలియ‌దు కానీ... మ‌హేష్ - సుకుమార్‌లు ఇటీవ‌ల `మ‌హ‌ర్షి` సెట్‌లో స‌మావేశ‌మైన‌ట్టు స‌మాచారం. చెన్నైలో చిత్రీక‌ర‌ణ జ‌రుగుతున్న విష‌యాన్ని తెలుసుకొని, సుకుమార్ అక్క‌డికి వెళ్లి మ‌హేష్‌ని క‌లిశార‌ట‌. వాళ్లిద్ద‌రూ చాలాసేపు స‌ర‌దాగా మాట్లాడుకున్న‌ట్టు తెలిసింది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.