మహేష్‌ మెచ్చిన పుస్తకం

టాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు మహేష్‌ బాబుకి పుస్తకాలు చదవడమంటే ఇష్టమని చాలామందికి తెలిసిన విషయమే. లాక్‌డౌన్‌ కారణంగా ఇంట్లోనే ఉంటున్న మహేష్‌ కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తూనే పుస్తకాలు తిరగేస్తున్నారు. ట్విటర్‌ వేదికగా ఇటీవలే ఆయన చదివిన ఓ పుస్తకం గురించి చెప్పుకొచ్చారిలా.. ‘‘రచయిత మనతో మాట్లాడుతున్నాడా అనేంతగా మనల్ని కథలో లీనమయ్యేలా చేసే పుస్తకాలు చాలా అరుదు. ఆ కోవకే చెందుతుంది ‘థింక్‌ లైక్‌ ఏ మాంక్‌’ పుస్తకం. జై శెట్టి మీరు రాక్‌ స్టార్‌’’ అంటూ రచయితని అభినందించాడు మహేష్‌. సినిమాల విషయానికొస్తే ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి బ్లాక్‌ బ్లస్టర్‌ తర్వాత పరశురామ్‌ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ మొదలు పెట్టారు. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఇందులో మహేష్‌ కొత్త లుక్‌ ఆసక్తి రేకెత్తిస్తోంది. మహేష్‌ సరసన కీర్తి సురేష్‌ నటిస్తోంది. సంగీతం: తమన్‌.




Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.