ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ ఇలా..

ప్రముఖ నటుడు కృష్ణ హీరోగా 1989లో విడుదలైన ‘కొడుకు దిద్దిన కాపురం’ చిత్రంలోని ఫొటో ఇది. ఆ సినిమాలో విజయశాంతి కథానాయికగా, మహేష్‌ బాల నటుడిగా చేసిన సంగతి తెలిసిందే. 30వసంతాల తర్వాత మళ్లీ ఈ ఇద్దరూ కలిసి అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో నటిస్తున్నారు. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ ‘కొడుకు దిద్దిన కాపురం’ చిత్రీకరణలో భాగంగా తీసిన ఈ ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు మహేష్.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.