ఇద్దరు భామలతో ముద్దుల మహేష్‌..

మహేష్‌ ప్రస్తుతం విహారంలో ఉన్నారు. ‘సరిలేరు నీకెవ్వరు’ విజయాన్ని ఆస్వాదిస్తూ, కుటుంబ సభ్యులతో కలిసి అమెరికాలో గడుపుతున్నారు. ఇక్కడ మాత్రం ఆయన కొత్త సినిమా కోసం శరవేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఆ చిత్రం తెరకెక్కబోతోంది. స్క్రిప్ట్‌కి తుది మెరుగులు దిద్దుతూనే, కథానాయికల ఎంపికపై దృష్టిపెట్టింది చిత్రబృందం. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఇందులో మహేష్‌ సరసన ఇద్దరు కథానాయికలు కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఇదివరకు ‘భరత్‌ అనే నేను’లో మహేష్‌తో కలిసి నటించిన కైరా అడ్వాణీ పేరు ప్రచారంలోకి వచ్చినా ఆమె హిందీ చిత్రాలతో తీరిక లేకుండా గడుపుతున్నారు. మరి మహేష్‌ సరసన మెరిసే ఆ భామలు ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మహేష్‌ ఈ చిత్రంలో గూఢచారిగా కనిపిస్తారని తెలుస్తోంది. ‘మహర్షి’ తర్వాత మహేష్‌ - వంశీ పైడిపల్లి కలయికలో రూపొందుతున్న చిత్రమిది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.