కన్నడ డైరెక్టర్‌తో మహేష్‌?
టీవల కాలంలో మహేష్‌ జోరు పెంచుతున్నారు. ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే మరొకటి లైన్‌లో పెట్టే పనిలో ఉన్నారాయన. ప్రస్తుతం మహేష్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో నటిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్‌ జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే ఆయన కన్నడ డైరెక్టర్‌ ‘కేజీఎఫ్‌’ ఫేం ప్రశాంత్‌ నీల్‌ చెప్పిన ఓ కథను ఓకే చేశారట. మహేష్‌- ప్రశాంత్‌ మధ్య చర్చలు సాగాయని, ప్రశాంత్‌ చెప్పిన కథ మహేష్‌కు బాగా నచ్చిందని, త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్‌తో ప్రశాంత్‌కు ఓ సినిమా ఖరారైంది. మైత్రీ మూవీస్‌ నిర్మించనుంది. ప్రశాంత్‌, మహేష్‌ ఇద్దరూ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అవి పూర్తయ్యాక పట్టాలెక్కిస్తారేమో చూడాలి.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.