మహేష్‌.. ‘సర్కారు వారి పాట’?

‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో ఈ సంక్రాంతికి చక్కటి విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు కథానాయకుడు మహేష్‌బాబు. ఇప్పుడీ జోష్‌లోనే యువ దర్శకుడు పరశురామ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుతం చిత్రసీమలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఇది తన తండ్రి సూపర్‌స్టార్‌ కృష్ణ జన్మదినం మే 31న సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇక తాజాగా ఈ చిత్ర టైటిల్‌పైనా చిత్ర బృందం ఓ స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. ఓ విభిన్న కథాంశంతో రూపొందబోతున్న ఈ చిత్రం కోసం ‘సర్కారు వారి పాట’ అనే ఆసక్తికర టైటిల్‌ను ఎంచుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కృష్ణ జన్మదినం నాడే ఈ టైటిల్‌ను కూడా ప్రకటించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. మరి ఇందులో వాస్తవమెంతన్నది మరి కొద్దిరోజుల్లో తేలిపోనుంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.