.jpg)
టాలీవుడ్ స్టార్ మహేష్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం తరువాత నటిస్తున్న సినిమా ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. మైత్రీ మూవీస్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యాంకు రుణాల కుంభకోణం నేపథ్యంగా అల్లుకున్న కథతో చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా హైదరాబాద్‌లోనే ఓ జాతీయ బ్యాంక్ సెట్ వేస్తున్నారు. సెట్ త్వరలోనే పూర్తి కానుంది. ఈ సెట్లో సుమారు నెలరోజుల పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. అయితే మొదట్లో సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్‌ని అమెరికాలో చిత్రీకరించేందుకు ప్రణాళికలు వేసుకున్నారు. అక్కడ కరోనా వైరస్ పరిస్థితుల ప్రభావంతో వాయిదా వేశారు. హైదరాబాద్ తదుపరి షూటింగ్ అమెరికాలో చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పుకుంటున్నారు. తమన్ సంగీతం సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు. చిత్రంలో వెన్నెల కిషోర్, సుబ్బరాజుతో పాటు భారీ తారాగణం నటించనుంది. చిత్రానికి సినిమాటోగ్రఫి: మధి, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, ఆర్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాష్, ఫైట్ మాస్టర్: రామ్ - లక్ష్మణ్. నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.