దక్షిణాదితో పాటు హిందీలో ‘మామాంగం‌’

మలయాళ నటుడు మమ్ముట్టి నటిస్తున్న చిత్రం ‘మామాంగం’. ఈ సినిమా డిసెంబర్‌ 12వ తేదీన దక్షణాది భాషలైన తెలుగు, తమిళ, మలయాళంతో పాటు బాలీవుడ్‌లోనూ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రం మమ్ముట్టి సినిమా జీవితంలోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కడం గమనార్హాం. ఇప్పటికే సినిమాకు సంబంధించి పోస్టర్లు, టీజర్‌ విడుదలై ఆకట్టుకుంటున్నాయి. కావ్య ఫిలిమ్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఎమ్‌.పద్మ కుమార్‌ దర్శకత్వం వహస్తుండగా, వేణు కున్నపిళ్లై నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.