ఐపీఎస్‌ అధికారిగా మమతా మోహన్‌దాస్‌

అం
దాల భామ మమతా మోహన్‌దాస్‌ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఫోరెన్సిక్‌: ది సైన్స్‌ ఆఫ్‌ ఎ క్రైమ్‌’. క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంగా తెరకెక్కుతున్న ఈ మలయాళ సినిమాకి అఖిల్‌ పాల్, అనాస్‌ ఖాన్‌ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. టివినో థామస్, ప్రతాప్‌ పోతన్, శ్రీకాంత్‌ మురళీ, రెబా మోనికా నటిస్తున్నారు. సెన్సార్‌ బోర్డు నుంచి ‘ఎ’ సర్టిఫికేట్‌ అందుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 28న విడుదల కానుందని చిత్రబృందం ప్రకటించింది. ఇందులో మమతా మోహన్‌దాస్‌ ఐపీఎస్‌ అధికారి రితికా జేవియర్‌గా నటిస్తోంది. ట్రైలర్‌ పలువురిని ఆకట్టుకుంటోంది. జువిస్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మితమౌతున్న చిత్రానికి నవీస్‌ ఎక్సేవియర్, సిజ్జు మ్యథ్యూలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.