థాయ్‌ల్యాండ్‌కి వెళ్లనున్న ‘పొన్నియన్‌ సెల్వన్‌’

సున్నితమైన కథాశాలను కథలుగా తీసుకొని వాటిని తెరపైకి తీసుకురావడంలో దర్శకుడు మణిరత్నం శైలే వేరు. ప్రస్తుతం ఆయన ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఆ సినిమాయే ‘పొన్నియన్‌ సెల్వన్‌’. ఈ సినిమా షూటింగ్‌ మొదటి షెడ్యూల్‌ని థాయ్‌ల్యాండ్‌లో తీయడానికి ప్రణాళికలు వేసుకొన్నారట. అక్కడ డిసెంబర్‌ రెండో వారం నుంచి రెగ్యులర్‌గా షూటింగ్‌ జరపుకోనుందని సమాచారం. చిత్రబృందం అంతా కలిసి వారం ముందుగానే అక్కడికి చేరుకోనున్నారట. ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా వస్తున్న ఈ చిత్రంలో నటి ఐశ్వర్యరాయ్, విక్రమ్, మోహన్‌బాబు, కార్తి, కీర్తి సురేష్, జయం రవిలు కలిసి నటించనున్నారు. మణిరత్నం తెరకెకిం్కచే చిత్రాల్లో లోకేషన్స్‌కి ఎంతో ప్రాధ్యానం ఉంటుంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.