హాస్పిటల్‌లో చేరిన మణిరత్నం

ప్రముఖ దర్శకుడు మణిరత్నం గుండెనొప్పితో ఓ ప్రవేట్‌ హాస్పిటల్‌ చేరారని సమాచారం. గత కొంతకాలంగా ఆయన ఎసిడెటి సమస్యతో బాధపడుతున్నారు. అందులో భాగంగానే చెకప్‌ కోసం వెళ్లారట. గుండెకు సంబంధించి చెకప్‌ చేసుకోవడం మణిరత్నానికి కొత్తకాదు. గతంలో 2004, 2009 సంవత్సరాల్లో రెండు సార్లు ఇలాంటి సమస్యతోనే హాస్పిటల్‌ వైద్యపరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. కానీ కొన్ని మీడియాల్లో మాత్రం హార్ట్‌ఎటాక్‌ రావడంతోనే ఆయన హాస్పిటలో చేరాడనే వార్తలు ఊపందుకున్నాయి. మణిరత్నం సన్నిహితులు మాత్రం రొటీన్‌ చెకప్‌లో భాగంగానే హాస్పిటల్‌కి వచ్చారని అంతకుమించి మరే సమస్యలేదని చెప్పకొస్తున్నారు. ప్రస్తుతం మణిరత్నం ‘పొన్నియన్‌ సెల్వన్‌’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తమిళనాడుకు చెందిన రాజు.. రాజ రాజ చోళన్‌ జీవితాధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకొంటుంది. ఇందులో అమితాబ్‌ బచ్చన్, ఐశ్వర్యరాయ్, విక్రమ్, అమాలాపాల్, కార్తి, అనుష్క శెట్టి, కార్తి, జయం రవి తదితరులు నటిస్తున్నారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.