మారుతితో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నిర్మాత రూ.6కోట్ల డీల్‌!!
కెరీర్‌ ఆరంభంలో ‘ఈరోజుల్లో’, ‘బస్‌స్టాప్‌’ వంటి చిత్రాలతో అడల్ట్‌ కంటెంట్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న మారుతి.. ‘భలే భలే మగాడివోయ్‌’ చిత్రంతో తనపై ఉన్న ఆ ముద్రను పూర్తిగా చెరిపేసుకున్నారు. అక్కడి నుంచి ఆయన వాణిజ్యాంశాలతో నిండిన వినోదాత్మక కథలకు చిరునామాగా నిలిచారు. ఇప్పుడీయన ‘ప్రతిరోజూ పండగే’ చిత్రంతో తొలిసారి ఫ్యామిలీ డ్రామాను రుచి చూపించబోతున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగానే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర నిర్మాత డి.వి.వి. దానయ్యతో ఓ భారీ ఒప్పందం చేసుకోనున్నారని సినీ వర్గాల్లో వినిపిస్తోంది. అదేటంటే? దానయ్య తన కుమారుడ్ని వెండితెరకు పరిచయం చేయబోతున్నారు. తన తనయుడ్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసే బాధ్యతను మారుతికి అప్పగించనున్నాడట దానయ్య. ఇందుకు మారుతికి భారీ మొత్తంలో రూ.6 కోట్ల రెమ్యునరేషన్‌ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మారుతి కెరీర్‌లోనే ఇది హయ్యస్ట్‌ రెమ్యునరేషన్‌ అని చిత్ర సీమలో చెప్పుకుంటున్నారు. ఈ ప్రాజెక్టును వచ్చే ఏడాది ప్రారంభంలోనే మొదలుపెట్టనున్నారట. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి. మరి నూతన కథానాయకుడుతో భారీ బడ్జెట్‌ చిత్రాన్ని ఏ నేపథ్యంలో తెరకెక్కిస్తాడో చూడాలి మరి.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.