అతిథి పాత్రలో..

యువ నాయిక మేఘా ఆకాష్‌ ‘గుర్తుందా శీతాకాలం’ చిత్రంలోని ప్రత్యేక పాత్రకు ఎంపికైంది. ఈ సినిమాలో తాను అతిథిగా కనిపించబోతుందని వెల్లడించింది చిత్ర బృందం. సత్య దేవ్‌, తమన్నా జంటగా తెరకెక్కుతోన్న చిత్రమిది. నాగశేఖర్‌ దర్శకత్వంలో రూపొందుతుంది. మలయాళంలో విజయవంతమైన ‘లవ్‌ మాక్‌టైల్‌’కి రీమేక్‌గా రాబోతుంది. మాతృకలో ఇద్దరు నాయికలు దర్శనమిస్తారు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే ఈ ప్రేమకథ రీమేక్‌లోనూ ఇద్దరికి అవకాశం ఉండటంతో మేఘా అవకాశం దక్కించుకుంది. నాగశేఖర్‌ మూవీస్‌ పతాకంపై భావన రవి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభంకానుంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.