కల్యాణ్‌రామ్‌ సరసన మెహ్రీన్‌

నందమూరి కల్యాణ్‌ రామ్‌ సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో త్వరలోనే ఓ చిత్రం చేయనున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా వెంకటేష్‌ మరదలు మెహ్రీన్‌ దక్కించుకుంది. అదేనండి ‘ఎఫ్‌2’ సినిమాలో వెంకీ మరదలు పాత్రలో ‘‘హని ఈజ్‌ ది బెస్ట్‌ అంటూ’’ హంగామా చేసింది మెహ్రీన్‌. ఇప్పటి వరకూ మెహ్రీన్‌ నటించిన చిత్రాల సంఖ్య తక్కువే, అయినా ‘ఎఫ్‌2’ చిత్రం తరువాత అమ్మడి క్రేజ్‌ అమాంతగా పెరిగింది. కానీ పాత్రల ఎంపిక విషయంలో మాత్రం ఆచితూచి అడుగువేస్తుంది. తెలుగులోనే కాక మధ్యమధ్యలో ఇతర భాషా చిత్రాల్లోను చేసింది. ఇప్పటి వరకు సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో వచ్చిన చిత్రాలను పరిశీలిస్తే కథానాయికల పాత్రలు చాలా అందంగా, సున్నితంగా ఉంటాయి. మరీ మెహ్రీన్‌ పాత్రను - కల్యాణ్‌రామ్‌ సరసన సతీష్‌ ఏవిధంగా తీర్చిదిద్దుతాడో వేచి చూడాలి మరి!



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.