ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్‌ హరికిషన్‌ ఇకలేరు


ప్రముఖ తెలుగు మిమిక్రీ ఆర్టిస్ట్ హరికిషన్ కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుప్రతిలో చికిత్స పొందుతూ హరికిషన్ మృతి చెందారు. 1963 మే 30న ఏలూరులో రంగమణి, వీఎల్ఎన్ చార్యులు దంపతులకు హరికిషన్ జన్మించారు. ఎంతోమంది రాజకీయ, సినీ నాయకుల గొంతులను మిమిక్రీ చేశారు. ఆ విద్యలో హరికిషన్ బాగా ప్రాచుర్యం పొందారు. తొలిసారి విజయవాడలో 1971లో హరికిషన్ తొలి మిమిక్రీ ప్రదర్శన చేశారు. దివంగత మిమిక్రీ ఆర్టిస్టు నేరెళ్ల వేణుమాధవ్ స్ఫూర్తితో హరికిషన్ మిమిక్రీ రంగంలోకి వచ్చినట్లు చెప్పేవారు. సినిమాలు, టీవీ షోల్లో హరికిషన్ ప్రదర్శనలు ఇచ్చారు. హరికిషన్ దేశ విదేశాల్లో సుమారు 10 వేలకు పైగా మిమిక్రీ ప్రదర్శనలు ఇచ్చారు. 12 ఏళ్ల పాటు ఉపాధ్యాయుడుగా పనిచేసిన హరికిషన్‌ హైదరాబాద్‌లోని పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయంలో మిమిక్రీ లెక్చరర్‌గాను పనిచేశారు. ఆయన హాస్యనటుడిగా ‘తొట్టిగ్యాంగ్’‌, ‘నువ్వులేక నేను లేను’, ‘ఆప్తుడు’, ‘జయం మనదేరా’, ‘సుభాష్‌ చంద్రబోస్‌’లాంటి సినిమాల్లో కనిపించారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.