కీర్తి మరో చిత్రం కూడా ఓటీటీలోనే విడుదల కానుందా!

జాతీయ ఉత్తమ నటి గ్రహిత కీర్తి సురేష్‌ నటించి విడుదలకు సిద్ధమైన చిత్రాలు పెంగ్విన్‌, మిస్‌ ఇండియా. కరోనా వైరస్‌ లేకుంటే ఈ పాటికే తెరపై సందడి చేసేవి. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా థియేటర్లు ఎప్పుడు తిరిగి ప్రారంభిస్తారో తెలియదు. అందువల్ల చిన్న సినిమాల నిర్మాతలకు ఓటీటీ ఆశాదీపంగా కనిపిస్తోంది. అందుకే తమ చిత్రాలను ఓటీటీ ద్వారా విడుదల చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. తాజాగా కీర్తి సురేష్‌ నటించిన ‘మిస్‌ ఇండియా సినిమాని కూడా ఓటీటీ ద్వారా విడుదల చేయడాని సిద్ధమైందట నిర్మాణ సంస్థ. ఇప్పటికే కీర్తి పెంగ్విన్‌ చిత్రం జూన్‌ 19న ఓటీటీ ద్వారా విడుదలకు సిద్ధమైంది. కీర్తి సురేష్‌ మిస్‌ ఇండియాగా నటిస్తున్న ఈ సినిమాకి నరేంద్రనాథ్‌ దర్శకత్వం వహించగా, మహేష్‌ కోనేరు నిర్మాతగా వ్యవహరించారు. ఇంకా చిత్రంలో జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్‌, నదియాలాంటి సీనీయర్‌ నటులు నటిస్తున్నారు.  పాత సామెత గుర్తు చేసుకున్నట్లు ఒక ద్వారం మూసినా మరో ద్వారం నీ కోసం తెరిచి ఉందని చెప్పినట్లు. థియేటర్లు మూసినా ఈ కష్టకాలంలో ఓటీటీ అనేది కొన్ని చిత్రాలకు వరమే అంటున్నారు కొంతమంది సినీ జనాలు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.