జనవరి 22న రానున్న అఖిల్‌ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’?

అక్కినేని అఖిల్‌ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే కథానాయిక నటిస్తోంది. తాజాగా అఖిల్‌ అక్కినేని స్పందిస్తూ..‘‘తన కొత్త చిత్రం వచ్చే ఏడాది జనవరి 22న థియేటర్లో విడదుల కానుందని చెప్పినట్లు’’ సమాచారం. అయితే అధికారికంగా ఇంకా విడుదల తేదీని ధృవీకరించలేదు. ప్రస్తుతం దేశం మొత్తం కరోనా వైరస్‌ (కోవిడ్‌ -19) ప్రభావంతో ప్రజలు స్వేఛ్చగా తిరిగే పరిస్థితి లేదు. అందుకే మరికొన్నాళ్లు గడిచాక కోవిడ్‌ ప్రభావం కూడా తగ్గి జనాలు కూడా థియేటర్లకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నారు. గీతా ఆర్ట్స్-2 పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాకు బన్నీ వాసు నిర్మాతగా వాసు వర్మ సహాయనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గోపిసుందర్ సంగీత స్వరాలు అందిస్తున్నారు. ఇప్పటికే సినిమాకి సంబంధించి ఆ మధ్య పోస్టర్ విడుదలైంది. అఖిల్ ల్యాప్ టాప్ పట్టుకుని సోఫాలో కూర్చుని కాఫీ తాగుతూ పనిచేసుకుంటుంటే కథానాయిక పూజాహెగ్డే వెనుక నుంచి తన కాలి మునివేళ్లతో అఖిల్‌ని రొమాంటిక్‌ టచ్‌ చేస్తూ కవ్విస్తున్నట్లుంది. పోస్టర్‌పై నెటిజన్లు కామెంట్లు పెడతూ మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ని ముగ్గులోకి దింపడానికి పూజా చేస్తున్న చిలిపి ప్రయత్నం అంటూ సరదాగా ఆటపట్టించారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.