‘జెర్సీ’లో ఐటెమ్‌ భామగా ఆదాశర్మ?
హజ నటుడు నాని నటిస్తున్న కొత్త చిత్రం ‘జెర్సీ’. ఈ చిత్రంలో ఐటెమ్‌ భామగా అదా శర్మ చేయనుందని సమాచారం. ఇందులో నాని సరసన ఆడిపాడేందుకు దాదాపుగా అదానే ఖాయమైందనే వార్తలు వినిపిస్తున్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాకి గౌతమ్‌ తిన్ననూరి దర్శకుడు. అదా శర్మ తెలుగు తొలిసారిగా పూరి దర్శకత్వంలో వచ్చిన ‘హార్ట్‌ ఎటాక్‌’ నితిన్‌ సరసన కథానాయికగా చేసింది. ఆ తరువాత ఆదితో ‘గరమ్‌’లోను నటించింది. ఆ మధ్యలో అల్లు అర్జున్‌ సరసన ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’, సాయిధరమ్‌ తేజ్‌తో చేసిన ‘సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌’ వంటి చిత్రాల్లో నటించింది. కానీ అవన్నీ పూర్తి స్థాయి పాత్రలు కాదనే చెప్పుకోవాలి. 2016లో విడుదలైన ‘క్షణం’ చిత్రంలో అడవి శేష్‌తో కలిసి శ్వేత పాత్రలో నటించి మెప్పించింది. ప్రస్తుతం రాజశేఖర్‌ నటిస్తున్న చిత్రం ‘కల్కి’. ఇందులో నందితా శ్వేతతో కలిసి అదా తెరపంచుకోనుంది.

అదాకు ఫిదా

మల్లకంబ... ఇదొక పురాతన భారతీయ సంప్రదాయ క్రీడ. చెక్క స్తంభంపై నిల్చోవడం, కేవలం చేతులు, కాళ్లతో బ్యాలెన్స్‌ చేసుకోవడం, తాడును నడుముకు చుట్టుకుని వేలాడటం... ఇలా రకరకాల సాహస భంగిమలు ఇందులో ఉంటాయి. మల్ల అంటే మల్లయుద్ధకారుడు... కంబ అంటే స్తంభం... ఈ రెండు పదాలను కలిపి దీనికి ఆ పేరు పెట్టారు. దీన్ని 2013లో మధ్యప్రదేశ్‌ తమ రాష్ట్ర క్రీడగా ప్రకటించింది. పలు రాష్ట్రాల్లోనూ ఈ క్రీడ ప్రాధాన్యంలో ఉంది. ఇది ఒలింపిక్స్‌లోనూ భాగమైందని తాజాగా నటి అదా శర్మ ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా పంచుకుంది. మొదటి ఛాంపియన్‌షిప్పు ఈ నెల 16, 17 తేదీల్లో ముంబయిలో జరగనుందని చెబుతోంది. ఈ క్రీడను సాధన చేస్తూ ఓ వీడియో తీసి నెటిజన్లతో పంచుకుంది. చెట్టు కొమ్మలకి తాడు కట్టి... కాళ్లకు, నడుముకి చుట్టుకుని వెల్లకిలా పడుకున్నట్టు బ్యాలెన్స్‌ చేసుకుంది. చెట్టుకు వేలాడుతూ కొంతసేపు అలానే ఉండి తీసిన నలభై మూడు సెకన్ల వీడియోను అదా తన ట్విట్టర్‌ ఖాతాలో ఉంచింది. అది చూసిన నెటిజన్లు... ఆహా అదా అంటూ ఆమె విన్యాసాలకు ఫిదా అవుతున్నారు. అదా శర్మ ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యమిస్తుంది. అందులో భాగంగానే ఆధునిక వ్యాయామ సాధనలతోపాటు... సంప్రదాయ మల్లయుద్ధం, కత్తి సాము.. ఇలా ఎన్నో నేర్చుకుంది. వాటికి సంబంధించిన విషయాలన్నీ సామాజిక మాధ్యమాల్లో ఎప్పటికప్పుడు పంచుకుంటుంది కూడా. ఇప్పుడు ఈ మల్లకంబ సాధన చేసే వీడియో కూడా తెగ వైరల్‌ అయ్యింది.

సంబంధిత వ్యాసాలు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.