కరోనాపై పోరాటం చేయాలి: నాగచైతన్య

‘‘ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా మంది కోవిడ్‌-19 పాజిటివ్‌ నిర్ధారణ కాగానే చాలా ఒత్తిడికి లోనవుతుంటారు. అలాంటి ఒత్తిడి నుంచి బయటపడి కరోనాపై పోరాటం చేసి గెలవాలి అంటున్నారు’’ హీరో నాగచైతన్య. తాజాగా ఆయన కరోనా వైరస్‌ గురించి స్పందిస్తూ..‘‘చాలామంది తమ భయంతోనే వైరస్‌ లక్షణాలున్నప్పటికీ చెప్పలేకపోతున్నారు. అందువల్ల ప్రాణాపాయ స్థితికి తెచ్చుకొని చేజేతులారా ప్రాణాల కోల్పోతున్నారు. ముందు ప్రతి ఒక్కరు వైరస్‌పై తమ భయాల్ని వీడి నిబ్బరంగా చికిత్స తీసుకోవాలి. కరోనా సోకిన తరువాత చికిత్స అనంతరం కోలుకున్నాక. వారు తమ అనుభవాలను పంచుకోవాలి. అప్పుడు మిగతా వారికి కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఇక కరోనా వైరస్‌ జయించాక ప్రతి ఒక్కరు ప్లాస్మా దానం చెయ్యడం మర్చిపోకండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీ సాయం చాలా మందికి అవసరం. వారి ప్రాణాలను నెలబెట్టినవారు అవుతారు. దయచేసి వైరస్‌ సోకిన వారి పట్ల వివక్ష చూపొద్దు. అందరం కలిసికట్టుగా పోరాడితే కరోనా మహమ్మారిపై విజయం సాధించవచ్చు’’ నని చెప్పారు. ప్రస్తుతం నాగచైతన్య శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్‌స్టోరీ’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సాయిపల్లవి కథానాయికగా నటిస్తోంది. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రానికి ‘థ్యాంక్యూ’ అనే పేరు ప్రచారంలో ఉంది. బి.వి.ఎస్‌.రవి కథతో, దిల్‌రాజు నిర్మాణంలో ఈ సినిమా రూపొందనుంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.