వెంకీ అట్లూరి దర్శకత్వంలో?

‘లవ్‌స్టోరీ’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు నాగచైతన్య. ఆయన కోసం ఇప్పటికే పలు కథలు సిద్ధమయ్యాయి. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో ‘థ్యాంక్యూ’ చేయబోతున్నారు. మోహనకృష్ణ ఇంద్రగంటి చైతూ కోసం ఒక కథని సిద్ధం చేశారు. స్పోర్ట్స్‌ డ్రామాతో కూడిన మరో కథని యువ దర్శకుడు వెంకీ అట్లూరి సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. అది చైతూ కోసమే అని, ఆయన ఇప్పటికే ఆ కథా నేపథ్యాన్ని విన్నారని తెలిసింది. వెంకీ అట్లూరి ప్రస్తుతం ‘రంగ్‌దే’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. మరి ఆ కలయికలో సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందనేది తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.