నాగార్జునతో పనిచేసే దర్శకుడు ఎవరు?

హిందీలో విజయవంతమైన ‘రైడ్‌’ని తెలుగులో రీమేక్‌ చేయడంపై ప్రముఖ కథానాయకుడు నాగార్జున ఎప్పట్నుంచో ఆసక్తి చూపుతున్నారు. ఈ సినిమా గురించి ఆయన పలువురు దర్శకులతో చర్చిస్తున్నట్టు సమాచారం. మరి ఆ చిత్రాన్ని తెరకెక్కించే బాధ్యతని ఎవరికి అప్పజెబుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నాగార్జున చేతిలో ప్రస్తుతం ‘వైల్డ్‌ డాగ్‌’ చిత్రం ఉంది. అది దాదాపుగా చివరి దశకు చేరుకుంది. అందుకే తదుపరి చేయాల్సిన చిత్రాలపై నాగార్జున దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలోనూ నాగార్జున ఓ సినిమా చేయబోతున్నారని సమాచారం. అదొక యాక్షన్‌ థ్రిల్లర్‌ కథతో రూపొందుతుందని తెలిసింది. ప్రవీణ్‌తో సినిమా తర్వాతే ‘రైడ్‌’ రీమేక్‌ పట్టాలెక్కే అవకాశాలున్నాయి.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.