సెట్స్‌పైకి వెళ్లనున్న బాలయ్య-బోయపాటిల చిత్రం

నందమూరి బాలకృష్ణ, మాస్‌ దర్శకుడు చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ నటిస్తున్న ఇంకా పేరుపెట్టని ఈ ‘106’వ చిత్రం వచ్చేనెల ఫిబ్రవరి 15 నుంచి సెట్సపైకి వెళ్లనుందని సమాచారం. అంతేకాదు ఈ ఏడాది జులైలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తుంది. మరోవైపు ఈ చిత్రంలో కీలక పాత్రలో శ్రీకాంత్‌ నటించనున్నారు. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందించనున్నారు. గతంలో బాలకృష్ణ సరసన నటించి మెప్పించిన నమిత కూడా చిత్రంలో నటించనుందని చెప్పుకుంటున్నారు. గత ఏడాది బాలకృష్ణ, కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో ‘రూలర్‌’గా నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వేదిక, సోనాల్‌ చౌహాన్‌ కథానాయికలుగా నటించగా, ప్రకాష్‌ రాజ్, జయసుధలు కీలక పాత్రల్లో నటించారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.