గోకుల్ మృతి నన్ను కలచివేసింది

తన నటనతో అందరినీ అలరించిన చిన్నారి గోకుల్‌ మృతిపై నటుడు బాలకృష్ణ సంతాపం వ్యక్తం చేశారు. ‘మాకు అభిమానుల కంటే విలువైనది మరొకటి ఉండదు. నన్ను అభిమానించే ఈ చిన్నారి ప్రాణాలతో లేడన్న విషయం నా మనసును కలచివేసింది. అతడు డైలాగులు చెప్పిన విధానం.. హావభావాలు చూసి నాకు ఎంతో ముచ్చటేసేది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఈ చిన్నారి ఇంత చిన్న వయసులో డెంగ్యూ వ్యాధితో ఈ లోకాన్ని విడిచి వెళ్లడం చాలా బాధ కలిగించింది. ఈ చిన్నారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ.. అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్న అన్నారు బాలకృష్ణ.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.