‘వి’లన్‌ వచ్చాడు!

యువ కథానాయకుడు నాని ‘వి’ చిత్రం కోసం విలన్‌గా మారాడు. మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. సుధీర్‌ బాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రంలోని నాని ఫస్ట్‌లుక్‌ విడుదల చేసింది చిత్ర బృందం. ఇందులో పవర్‌ఫుల్‌ లుక్‌లో దర్శనమిచ్చాడు నాని. గెడ్డం, మీసాలు పెంచి ఇప్పటి వరకు కనిపించని అవతారమెత్తాడు. చేతిలో కత్తెర పట్టుకుని విలనిజం ప్రదర్శిస్తూ ఆసక్తి రేకెత్తిస్తున్నాడు. ఈ చిత్రంలో రాక్షసుడుగా నాని, రక్షకుడుగా సుధీర్‌ కనిపించబోతున్నారు. ఇటీవలే విడుదలైన సుధీర్‌ ఫస్ట్‌లుక్‌ సైతం అందరినీ ఆకట్టుకుంది. టైటిల్‌, ఫస్ట్‌లుక్స్‌తోనే సినిమాపై అంచనాలు పెంచుతుంది ‘వి’ చిత్ర బృందం. నివేదా థామస్‌, అతిథిరావు హైదరీ కథానాయికలు. ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి అమిత్‌ త్రివేది సంగీతం అందిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుని మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.