నానితో సాయి పల్లవి?

‘ఎంసీఏ’ చిత్రంతో సందడి చేసిన నాని, సాయి పల్లవి జంట మరోసారి కనువిందు చేయబోతుందని సమాచారం. ఇటీవలే నాని కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. ‘శ్యామ్‌ సింగరాయ్‌’ పేరుతో దర్శకుడు రాహుల్‌ సంక్రిత్యాన్‌ తెరకెక్కిస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్నారు. నాని 27వ సినిమాగా రూపొందుతుంది. ఈ విషయం తెలిసినప్పటి నుంచి నాని సరసన నటించేది ఎవరా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఈ నేపథ్యంలో నాయిక సాయి పల్లవి పేరు వినిపిస్తున్నాయి సినీ వర్గాలు. ఇప్పటికే ఆమెతో చర్చలు సాగాయని, పచ్చజండా ఊపే అవకాశాలున్నాయని తెలుస్తోంది. కొన్ని రోజులు అధికారిక రానుంది. తొలి చిత్రంతోనే హిట్‌ పెయిర్‌గా నిలిచిన నాని-పల్లవి మరోసారి కలిసి నటిస్తున్నారడంతో అందరిలో ఆసక్తి పెరిగింది. డిసెంబరు 25న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.