ముత్తాత పాత్రలో మనుమడు

న్‌బీకే, వారాహి ఫిలిమ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మహానాయకుడు’. క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ మునిమనుమడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి మనుమడు దేవాన్ష్ నటించాడట. గత వారమే దేవాన్ష్‌పై ఎన్టీఆర్‌ చిన్నప్పటి సన్నివేశాల చిత్రీకరణను పూర్తయిందని సమాచారం. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకొంటోంది. ఫిబ్రవరి నెలలోనే ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. స్క్రిప్ట్‌లో మార్పుల కారణంగా విడుదల వాయిదా పడింది. ఈ సినిమాకు కీరవాణి స్వరాలను సమకూర్చారు. త్వరలో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.