ముందస్తు బుకింగ్‌ ద్వారా 50 లక్షలు వసూలు చేసిన ‘నర్తనశాల’

నందమూరి బాలకృష్ణ దర్శకత్వంలో ప్రారంభమై మధ్యలోనే అర్థాంతరంగా ఆగిపోయిన చిత్రం ‘నర్తనశాల’. ఈ సినిమాకి సంబంధించిన పదిహేడు నిమిషాలు నిడివి కలిగిన సన్నివేశాలను శ్రేయాస్‌ మీడియాలో విడుదల చేయనున్నారు. ఈ సన్నివేశాలు చూసేందుకు ఆన్‌లైన్‌ బుకింగ్‌లో 50 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఆవిధంగా ఈ సినిమా ఇప్పటికే ముందస్తు బుకింగ్‌లో యాభైలక్షలకు పైగా వసూళ్లు చేసింది. పే పర్ వ్యూ మోడల్‌ ద్వారా విడుదల అవుతున్న ఈ చిత్రం ఇప్పటికే లక్ష వరకు టెక్కెట్లు అమ్ముడయ్యాయని సమాచారం. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లో దివంగత తారలు సౌందర్య, శ్రీహరి నటనను చూసే అవకాశం వచ్చింది. సినిమాలో ధర్మరాజుగా శరత్‌బాబు, భీముడిగా శ్రీహరి, అర్జునుడిగా నందమూరి బాలకృష్ణ, ద్రౌపదిగా సౌందర్యలు నటించారు. ‘నర్తనశాల’ సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేయగా వ‌చ్చిన ఆదాయంలో కొంతమేర సేవా కార్యక్ర‌మాల‌కు ఉప‌యోగించాల‌ని బాల‌కృష్ణ భావించారు.                          

                             


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.