ధనుష్‌తో కలిసి నటించడం ఆనందంగా ఉంది!

థానాయకుడు నవీన్‌చంద్ర ‘అందాల రాక్షసి’తో నటుడుగా ప్రస్థానం మొదలుపెట్టి ఎన్నో సినిమాల్లో వైవిధ్యమైన నటనతో అందరిని ఆకట్టుకున్నాడు. ఓ పక్క హీరోగా చేస్తూనే మరోపక్క వేరే పాత్రల్లోనూ రాణిస్తున్నాడు. తమిళ స్టార్‌ ధనుష్‌తో ఓ చిత్రంలో నవీన్‌చంద్ర ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా నవీన్‌ మాట్లాడుతూ...‘‘ధనుష్‌తో నటిస్తోన్న మొదటి చిత్రం ఇది. ధనుష్‌ గొప్ప నటుడు. తన పనిదే తను చూసుకుంటూ చాలా కామ్‌ ఉంటారు. మే నెల నుంచి రెండో షెడ్యూల్‌కు వెళ్లబోతున్నాం. ఇందుకోసం చాలా కష్టపడుతున్నాను. దర్శకుడు దురై సెంథిల్‌ కుమార్‌ వంటి మంచి ప్రతిభావంతుడైన నిపుణుడితో కలిసి పనిచేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది’’ అని చెప్పాడు. దురై సెంథిల్‌ కుమార్‌ గతంలో ధనుష్‌తోనే కోడి అనే చిత్రం చేశారు. ఇది తెలుగులో ‘ధర్మయోగి’గా వచ్చింది. నవీన్‌చంద్ర తెలుగులో ఎన్టీఆర్‌తో కలిసి ‘అరవింద సమేత’లో ప్రతినాయకుడిగా నటించి తనదైన ముద్రవేశారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.