సినీనటి ఎంపీ నవనీత్‌ కౌర్‌కి కరోనా పాజిటివ్‌

ప్రముఖ సినీనటి, మహారాష్ట్ర చెందిన అమరావతి ఎంపీ నవనీత్‌ కౌర్‌కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అంతేకాదు ఆమెతో పాటు ఇంట్లోని కుటుంబ సభ్యులైన పదొకొండు మందికి కోవిడ్‌ 19 సోకింది. అయితే ముందుగా ఎంపీ నవనీత్‌ కౌర్‌ మామ అయినటువంటి గంగాధర్‌ రాణాకు కరోనా వచ్చింది. ఆ తరువాతనే ఆమె కుటంబ సభ్యులందరికి వైరస్‌ సోకింది. దాంతో ఆమె ఇంటిని రాష్ట్ర ఆరోగ్యశాఖ శానిటైజ్‌ చేయించింది. పరిసర ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. నవనీత్‌ కౌర్‌ తెలుగులో శ్రీను వాసంతి లక్ష్మి, రణం, మహారధి, జాబిలమ్మలాంటి చిత్రాల్లో చేసింది. 



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.