సూర్యకు జోడిగా నయనతార!
సింగం హీరో సూర్య, నయనతార కలిసి గతంలో గజిని, ఘటికుడు లాంటి కొన్ని చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం సూర్య కాప్పాన్‌ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా తరువాత శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రంలో కథానాయికగా నయనతారను తీసుకున్నారని సమాచారం. సాధ్యమైనంత త్వరలో చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లి వచ్చే సంక్రాంతి నాటికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని యోచిస్తున్నారట. చిత్రంలో కాజల్‌ కూడా మరో పాత్రలో నటించనుందట. మొత్తం మీద ఇటు తెలుగులో అటు తమిళం నయనతార బిజీబిజీగా ఉందనడంలో సందేహం లేదు. నయన ఇప్పటికే చిరంజీవితో కలిసి సైరాలో నటిస్తుంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.