దూసుకెళ్తున్న తార

ఎంతమంది కొత్త కథానాయికలు వచ్చినా నయనతార మాత్రం తన స్థానాన్ని కాపాడుకుంటూ వస్తుంది. వయసు ముఫ్పైదాటిన కూడా సినిమాలు మాత్రం తగ్గడం లేదు. దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నయనతార సంగతి ఇలా ఉంది. ప్రస్తుతం సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో చిరంజీవితో కలిసి ‘సైరా’లో నటిస్తుంది. తమిళంలో వచ్చిన ‘కొలమావు కోకిల’ చిత్రానికి తెలుగులో ‘కోకో కోకిల’ పేరుతో వచ్చే నెలలోనే విడుదల కానుంది. ఇంకా మలయాళ చిత్రం ‘లవ్‌ యాక్షన్‌ డ్రామ’లోనూ నటిస్తుంది. శంకర్‌ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘భారతీయుడు2’ సీక్వెల్‌లోను నయన నటించనుంది.
తలైవా అజిత్‌తో కలిసి ఓ చిత్రం చేయడానికి సిద్దమైంది. మొత్తం మీద ఎలా చూసినా దక్షిణాదిలో ముఫై సంవత్సరాలు దాటికన కథానాయికల్లో నయనతార మాత్రం ఇలా వరుస అవకాశాలతో ముందుకెళ్తుంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.