నితిన్‌ చిత్రంలో నయనతార?
తెలుగు నటుడు నితిన్ - మేర్లపాక గాంధీ దర్శకత్వంలో హిందీలో వచ్చిన ‘అంధాదున్’‌ చిత్రానికి రీమేక్ చిత్రంలో నటిస్తున్నారు.  ఈ సినిమాలో నయనతారతో ఓ కీలక పాత్రలో నటింపజేసేందుకు చిత్రబృందం ప్రయత్నిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. బాలీవుడ్‌ ‘అంధాదున్’‌ చిత్రంలో టబు ఓ పాత్రలో నటించింది. ఈ పాత్రలోనే నయనతార నటించాల్సి ఉంది. అయితే ఇప్పటికే చిత్రబృందం పలువురు సీనియర్‌ నటీమణులను కూడా సంప్రదించారు. అయితే ఇంకా ఎవరినీ ఖరారు చేయలేదు. మొత్తం మీద ఓ పక్క కథానాయికగా నటిస్తున్న నయనతార ఇలాంటి వైవిధ్యమైన పాత్రల్లో కూడా రాణిస్తుందేమో తెలియాలంటే కొంతకాలం పాటు వేచి చూడాల్సిందే. నయనతార - విఘ్నేష్‌ శివన్‌ చాలాకాలం నుంచి ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో వీళ్ల గురించి ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కరోనా వైరస్‌ కారణంగా లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయిన నయనతార - విఘ్నేష్‌లు ఓ గుడిలో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారట. అందుకోసం తమిళనాడులోని ఓ జోత్యుష్కుడు సలహా మేరకు అన్ని దేవాలయాలను సందర్శించిన తరువాతే వివాహం చేసుకోవాలనుకుంటున్నారని సమాచారం. ఇప్పటికే ఈ ప్రేమికులిద్దరూ కేరళ, తమిళనాడులోని పలు ఆలయాలను సందర్శించారు. తాజాగా వీరు తమిళనాడులోని కుంభకోణం దగ్గరలోని తిరునాగేశ్వరం రాహు ఆలయాన్ని ఇద్దరూ సందర్శించనున్నారట. అక్కడ ప్రత్యేక పూజలు కూడా చేయనున్నారట. చాలాకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట ఇప్పటికే పలు దేశాలు చుట్టొచ్చారు. నయనతార తమిళంలో ఆర్జే బాలాజీ దర్శకత్వంలో ‘మూకుతి అమ్మన్’‌లో చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. విజయ్‌ సేతుపతితో కలిసి ‘కాతువాకుల రెండు కాదల్’ చిత్రంలోనూ చేస్తుంది. ఇందులో సమంత అక్కినేని కూడా నటిస్తోంది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.