‘దర్బార్‌’లో అడుగుపెట్టిన నయనతార!

సూపర్‌స్టార్‌ రజనీకాంత్, ఏ.ఆర్‌.మురగదాస్‌ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం ‘దర్బార్‌’. ఈ చిత్రం ముంబైలో ప్రారంభమై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. చిత్ర కథానాయిక నయనతార మాత్రం దర్బార్‌లో ప్రవేశించింది మాత్రం ఇప్పుడేనట. త్వరలోనే రజనీ - నయనలపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాడానికి సన్నాహాలు చేస్తున్నారట చిత్ర యూనిట్‌. ఇందులో రజనీకాంత్‌ పోలీస్‌ అధికారిగా నటిస్తుండగా, ప్రతినాయకుడిగా ప్రతీక్‌ బబ్బర్‌ నటిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మితమౌతున్న ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నారు. అలీరాజా శుభకరన్‌ నిర్మాత. సినిమా 2020 సంక్రాంతి నాటికి తెరపైకి రానుంది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.